
ఉషస్విని ఫిలిమ్స్ పతాకంపై జవ్వాజి సురేంద్ర కుమార్ సమర్పణలో బ్రహ్మాజీ, శత్రు, ‘మాస్టర్’ మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కర్మణ్యే వాధికారస్తే. బెనర్జీ, పృథ్వీ, శివాజీ రాజా, అజయ్ రత్నం, మరియు శ్రీ సుధా ముఖ్య పాత్రల్లో నటించారు. అమర్ దీప్ చల్లపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డి ఎస్ ఎస్ దుర్గా ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం అక్టోబర్ 31న థియేటర్స్ లో విడుదలై విజయం సాధించింది. ఇప్పుడు సన్ నెక్స్ట్ ఓ టి టి లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఈ సందర్భంగా దర్శకుడు అమర్ దీప్ చల్లపల్లి మాట్లాడుతూ “మా కర్మణ్యే వాధికారస్తే అక్టోబర్ 31 న థియేటర్స్ లో విడుదల అయింది. మంచి రివ్యూస్ వచ్చాయి. చూసిన ప్రతి ప్రేక్షకుడు సినిమా చాలా బాగుంది అంటున్నారు. ఇప్పుడు మా చిత్రం సన్ నెక్స్ట్ ఓ టి టి లో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పక చూడండి. థియేటర్ లో చూడని వారు సన్ నెక్స్ట్ ఓ టి టి లో చూసి మా సినిమా ని ఎంజాయ్ చేయండి” అని తెలిపారు.
నిర్మాత డి ఎస్ ఎస్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ “మా కర్మణ్యే వాధికారస్తే చిత్రాన్ని ప్రేక్షకులు చూసి సూపర్ హిట్ చేసినందుకు ధన్యవాదాలు. మంచి స్పందన మరియు అద్భుతమైన రివ్యూస్ వచ్చారు. 100 థియేటర్స్ లో విడుదల చేసాము ఇప్పుడు మా చిత్రం సన్ నెక్స్ట్ ఓ టి టి లో స్ట్రీమింగ్ అవుతుంది. అందరు తప్పక చూడండి” అని తెలిపారు.
నటి నటులు: బ్రహ్మాజీ, శత్రు, మాస్టర్ మహేంద్ర, బెనర్జీ, పృథ్వి, శివాజీ రాజా, అజయ్ రత్నం, శ్రీ సుధా, కృష్ణ భట్(నూతన పరిచయం). ఇరా దయానంద్(నూతన పరిచయం), అయేషా(నూతన పరిచయం), రెహానా ఖాన్(నూతన పరిచయం), జయ రావు, బాహుబలి మధు, తదితరులు
బ్యానర్: ఉషస్విని ఫిలిమ్స్
సమర్పణ: జవ్వాజి సురేంద్ర కుమార్
చిత్రం పేరు: కర్మణ్యే వాధికారస్తే
సంగీతం: గ్యాని
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
డి ఓ పి: భాస్కర్ సామల
కథ, మాటలు: శివ కుమార్ పెళ్లూరు
ఫైట్ మాస్టర్: రామ్ సుంకర, డ్రాగన్ అంజి
లిరిక్స్: శ్రేష్ఠ (అర్జున్ రెడ్డి)
టీజర్ కట్: వాల్స్ అండ్ ట్రెండ్స్
పోస్ట్ ప్రొడక్షన్: సారధి స్టూడియోస్, ప్రసాద్ ల్యాబ్స్
పబ్లిసిటీ డిజైనర్: ఏ జె ఆర్ట్స్
నిర్మాత”: డి ఎస్ ఎస్ దుర్గాప్రసాద్
స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం: అమర్ దీప్ చల్లపల్లి


