#AB4 టైటిల్ గా ‘శ్రీనివాస మంగాపురం’ – ప్రీ-లుక్ పోస్టర్ విడుదల

సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు కుమారుడు, సూపర్‌స్టార్ మహేష్ బాబు మేనల్లుడు జయకృష్ణ ఘట్టమనేని, సినీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ డెబ్యూ చేస్తున్నారు. ఆర్ఎక్స్ 100, మంగళవారం వంటి కల్ట్ హిట్స్ ఇచ్చిన అజయ్ భూపతి డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ అశ్వినీ దత్ సమర్పిస్తుండగా, చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు. భావోద్వేగాలు, రా ఇంటెన్సిటీ, ఆథెంటిసిటీతో నిండిన ఈ మూవీ, టైమ్‌లెస్ కల్ట్ లవ్ స్టోరీగా రూపొందుతోంది.

ఇవాళ మేకర్స్ టైటిల్‌ను గ్రిప్పింగ్ ప్రీ-లుక్ పోస్టర్‌తో విడుదల చేశారు. ‘శ్రీనివాస మంగాపురం’ టైటిల్‌తో వచ్చిన పోస్టర్‌లో హీరో, హీరోయిన్ చేతులు పెనవేసుకున్న దృశ్యం కనిపిస్తుంది – హీరో గాయపడిన చేతిలో రస్టిక్ గన్, హీరోయిన్ చేయి అతడిని ఆదరిస్తూ. తిరుమల ఆలయం, శేషాచలం కొండల నేపథ్యం సింబాలిజమ్‌ను జోడిస్తుంది. ఇద్దరి జీవితాలు-ఒక ప్రయాణం, ఇద్దరి చేతులు-ఒక ప్రామిస్, ఇద్దరి హృదయాలు-ఒక డెస్టినీ అనే థీమ్‌తో పోస్టర్ ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంది.

జయకృష్ణ తన రోల్ కోసం ఇంటెన్స్ ప్రిపరేషన్ చేస్తూ షూటింగ్‌లో ఉన్నారు. బాలీవుడ్ నటి రాషా థడాని, ఈ చిత్రంతో టాలీవుడ్ డెబ్యూ చేస్తూ కీలక పాత్రలో నటిస్తున్నారు.

సూపర్‌స్టార్ కృష్ణతో ‘అగ్ని పర్వతం’, మహేష్ బాబుతో ‘రాజకుమారుడు’ చేసిన అశ్వినీ దత్, ఇప్పుడు మూడో తరం స్టార్ జయకృష్ణను ప్రెజెంట్ చేస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. సపోర్టింగ్ కాస్ట్, టెక్నికల్ క్రూ వివరాలు త్వరలో ప్రకటిస్తారు.

టైటిల్, ప్రీ-లుక్ పోస్టర్‌తో బజ్ సృష్టించిన మేకర్స్, ఫస్ట్ లుక్, మరిన్ని అప్‌డేట్స్ త్వరలో విడుదల చేస్తామని తెలిపారు.

కాస్ట్: జయకృష్ణ ఘట్టమనేని, రాషా థడాని

టెక్నికల్ క్రూ:

రచన & డైరెక్షన్: అజయ్ భూపతి;

సమర్పణ: అశ్వినీ దత్;

నిర్మాత: పి. కిరణ్;

బ్యానర్: చందమామ కథలు;

మ్యూజిక్: జీవీ ప్రకాశ్ కుమార్;

పీఆర్ఓ: వంశీ-శేఖర్

Related Articles

Latest Articles