చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ నుండి రెండవ సాంగ్ అప్డేట్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్‌గా హిట్ మెషిన్ అనిల్ రవిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న మాస్-ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మితా కొణిదెల నిర్మాతలుగా, శ్రీమతి అర్చన ప్రజెంట్ చేస్తున్న ఈ చిత్రం మ్యూజికల్ జర్నీ మొదలైంది. మొదటి సింగిల్ ‘మీసాల పిల్ల’ 75 మిలియన్ల వ్యూస్ సాధించి సంచలనం సృష్టించింది.ఇప్పుడు రెండో సాంగ్ ‘శశిరేఖ’ అప్‌డేట్ వచ్చింది. భీమ్స్ సిసిరోలియో స్వరసారథ్యంలో రూపొందిన ఈ మెలోడియస్ ట్రాక్‌లో చిరంజీవి ఎనర్జిటిక్ డ్యాన్స్, నయనతార స్టైలిష్ పోజ్‌లు పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌లో విజువల్ ట్రీట్ ఇవ్వనున్నాయి. ప్రోమో డిసెంబర్ 6న, లిరికల్ వీడియో 8న విడుదల కానుంది.

విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అతని షూటింగ్ పూర్తయింది. చిరు-వెంకటేష్ మాస్ డ్యాన్స్ నంబర్ మరో హైలైట్. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ డైరెక్షన్, ఎస్ కృష్ణ, జి ఆది నారాయణ రచనలతో టెక్నికల్ టీమ్ బలంగా ఉంది.

సంక్రాంతి 2026కి రిలీజ్ కానున్న ఈ బిగ్ బజెట్ మూవీలో విటివి గణేష్ కూడా నటిస్తున్నారు.

Related Articles

Latest Articles