ప్యూర్ వెజ్ రెస్టారెంట్ ‘శుద్ద్ విలాస్’ను ప్రారంభించిన సక్సెస్ ఫుల్ హీరో శ్రీ విష్ణు

శాకాహారుల కోసం ప్రత్యేకమైన రెస్టారెంట్లు చాలా అరుదుగా ఉంటాయి. ఇక ప్యూర్ వెజ్ రెస్టారెంట్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. రకరకాల వంటకాలతో, పసందైన రుచులతో శాకాహారుల్ని ఆకట్టుకునేందుకు నగరంలో ‘శుద్ద్ విలాస్’ ప్రారంభమైంది. మల్కాజ్ గిరిలో ఈ న్యూ బ్రాంచ్‌ను సక్సెస్ ఫుల్ హీరో శ్రీ విష్ణు ఓపెన్ చేశారు. రెస్టారెంట్‌ను ఓపెన్ చేయడమే కాకుండా అక్కడ అన్ని రకాల వంటకాలను రుచి చూశారు. అన్ని రకాల వెరైటీ వంటకాలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో శ్రీ విష్ణుతో పాటుగా నిర్వాహకులు శశికాంత్, శ్రీరామ్‌, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, దర్శకుడు శేఖర్ కమ్ముల, కోన వెంకట్, మల్కాజ్‌గిరి బ్రాంచ్ భాగస్వాములు రాజీవ్, రాజ శేఖర్, హుస్సేన్, వెంకట్ మార్తాండ్ పాల్గొన్నారు.

రెస్టారెంట్‌ను ప్రారంభించిన అనంతరం శ్రీ విష్ణు మాట్లాడుతూ.. ‘నేటి అర్బన్, బిజీ లైఫ్ స్టైల్‌లో క్లీన్, క్వాలిటీ, హెల్దీ ఫుడ్‌కు డిమాండ్ పెరిగింది. మరీ ముఖ్యంగా శాకాహార భోజనాన్ని అందరూ ఇష్టపడుతున్నారు. వెజ్‌నే అందరూ ప్రిఫర్ చేస్తున్నారు. ప్రజల అభిరుచికి తగ్గట్టుగా ప్రారంభించిన ‘శుద్ద్ విలాస్’ యాజమాన్యానికి ఆల్ ది బెస్ట్. శాకాహార ప్రియులందరికీ ఈ రెస్టారెంట్ హాట్ ఫేవరేట్‌గా మారుతుందని విశ్వసిస్తున్నాను’ అని అన్నారు.

బ్రాండ్ యజమానులు శశికాంత్, శ్రీరామ్ మాట్లాడుతూ.. ఈ ‘శుద్ధ్ విలాస్’ను భారతీయ పాక శాస్త్ర సంప్రదాయాల్లోని ప్రామాణిక శాకాహార వంటకాలను అందించే లక్ష్యంతో, స్వచ్ఛత, స్థిరత్వం, భోజన ప్రియుల సంతృప్తి కోసం రాజీలేని ప్రమాణాలను కొనసాగిస్తామని తెలిపారు. సమీప భవిష్యత్తులో బ్రాండ్‌ను ఇతర ప్రదేశాలకు విస్తరించే ప్రణాళికలను కూడా వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా కూడా ఇక్కడి రుచికరమైన భోజనాన్ని ఆస్వాధించారు.

Related Articles

Latest Articles