
నట కిరీటి డా.రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్ర పోషించిన హార్ట్ టచ్చింగ్ చిత్రం “నేనెవరు?”. “నువ్వే కావాలి, ప్రేమించు” చిత్రాల ఫేమ్ సాయి కిరణ్, జోగిని శ్యామల కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని చిరంజీవి తన్నీరు దర్శకత్వంలో జై చిరంజీవ ఫిల్మ్ మేకర్స్ పతాకంపై సరికొండ మల్లిఖార్జున్ సమర్పణలో అండేకర్ జగదీష్ బాబు – సకినాన భూలక్ష్మి సంయుక్తంగా నిర్మించారు.
వైజాగ్ సత్యానంద్ శిష్యులు అభిలాష్ – సాయి చెర్రీ హీరోలుగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో దీపిక, సోనాక్షి హీరోయిన్లు. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. తన కెరీర్ లో చాలా గర్వంగా చెప్పుకునే చిత్రాల జాబితాలో “నేనెవరు?” నిలుస్తుందని ఈ చిత్రం టీజర్ రిలీజ్ వేడుకలో రాజేంద్రప్రసాద్ ప్రకటించిన నేపధ్యంలో… ఈ చిత్రానికి బిజినెస్ పరంగా క్రేజ్ పెరిగిందని.. విడుదల తేది త్వరలో ప్రకటిస్తామని నిర్మాతల్లో ఒకరైన భూలక్ష్మి తెలిపారు.
ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, మాటలు: శ్రీనివాస్ అంగిరెడ్డి, పాటలు: ఎస్.ఎస్.వీరు, కొరియోగ్రఫీ: అజయ్ క్రిష్ – సంతోష్, సంగీతం: చిన్నికృష్ణ, ఛాయాగ్రహణం: నాయుడు ప్రసాద్ కొల్లి, ఎడిటింగ్: నందమూరి హరి – నందమూరి తారకరామారావు.


