
లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మురళి కాంత్ దర్శకత్వంలో రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మాతగా క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం దండోరా. శివాజీ, నవదీప్, నందు, రామకృష్ణ, బిందు మాధవి, మణిక, మౌనిక తదితరులు ముఖ్యపాత్రలలో నటిస్తూ ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రానికి వెంకట్ ఆర్ సినిమాటోగ్రఫీ చేయగా సృజన అడుసుమిల్లి ఎడిటర్ గా పని చేశారు. మార్క కే రాబిన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా అదితి భవరాజు, రాధ్య, బలగం మురళీధర్ గౌడ్ తదితరులు చిత్రంలో కీలకపాత్ర పోషించారు. క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…
కథ :
2004, 2019 సమయాలలో మెదక్ జిల్లాలోని ఒక గ్రామంలో జరిగిన కొన్ని సంఘటనలు, వాటి వల్ల ఆ గ్రామంలో జరిగే కొన్ని మార్పులు, కుటుంబాలు ఎలా ఉంటాయనేది ఈ చిత్ర కథ. ఒక కులంలోని అమ్మాయి మరొక కులంలోని అబ్బాయి ప్రేమించుకుంటారు. నాడు ఆ గ్రామంలో ఉన్న కుల వివక్షల వల్ల వారి పెళ్లి అవుతుందా లేదా? ఆ గ్రామ సర్పంచ్ వల్ల జరిగే మార్పులు ఏంటి? వారి జీవితాలలో గ్రామంలోని ఇతరుల వల్ల వచ్చే మార్పులు ఏంటి? అసలు ఆ ఊరి స్మశాన వాటిక సమస్య ఏంటి? చివరికి ఆ స్మశాన వాటిక సమస్య తీరుతుందా లేదా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియకంటే వెండి తెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
నటీనటుల నటన :
దండోరా చిత్రం అంటే శివాజీ అనే విధంగా శివాజీ నటించారు. తన క్యారెక్టర్రైజేషన్ చూపిస్తూ తన పెర్ఫార్మన్స్ నిదానంగా మొదలై క్లైమాక్స్ కు వెళ్లేప్పటికీ ఎమోషనల్గా చిత్రం అంతట పీక్స్ లో నటించరు. గ్రామ సర్పంచ్ పాత్రలో నవదీప్ సరదాగా కనిపిస్తానే గ్రామంలోని బాగోగులు అంతా తానే చూసుకుంటున్న ఒక పెద్ద మనిషి వలె మంచి పర్ఫామెన్స్ ఇచ్చారు. నందు సరికొత్త క్యారెక్టర్తో సినిమాలో తనదైన పాత్రకు ముద్ర వేసుకున్నారు. రవికృష్ణ వెండితెరపై కనిపించినంత సేపు అటు స్టైల్గా అలాగే సినిమాలోని కీలక పాత్ర తానై అద్భుతంగా నటించారు. బిందు మాధవి అటువంటి పాత్రను అంగీకరించడం అనేది గొప్ప విషయంగా భావించాలి. తన పాత్ర పరిధిలో తను నటిస్తూ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారు. అలాగే చిత్రంలో నటించినటువంటి తమ తమ పాత్రలలో జీవిస్తూ చిత్రానికి మరింత విలువ పెంచారు. చిత్రంలో నటించిన ప్రతి నటీనటులు తమ తమ పాత్రలకు న్యాయం చేస్తూ ప్రతి ఒక్కడి పాత ప్రాముఖ్యతను ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా నటించారు.
సాంకేతిక విశ్లేషణ :
ఒక గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి ఉన్న ఒక సమస్యను ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా అలాగే ప్రేక్షకులు అంగీకరించే విధంగా వెండితెరపై చూపించడం అనేది ఎంతో ఛాలెంజింగ్ విషయం. కాని దర్శకుడు మురళి అటువంటి గొప్ప ఛాలెంజింగ్ విషయాన్ని ప్రేక్షకులు మనస్ఫూర్తిగా అంగీకరించే విధంగా చూపిస్తూ దర్శకుడుగా విజయం సాధించాలని చెప్పుకోవాలి. అలాగే అటువంటి చిత్రాన్ని వెండితెరపై తీసి రావడం వల్ల కీలకపాత్ర పోషించే డిఓపి తన పాత్రను ఈ చిత్రంలో నూటికి నూరు శాతం పర్ఫెక్ట్ గా చేశారు. సినిమాలోని పాటలు కంటే బిజిఎం స్కోర్ సినిమాలోని సంగీతానికి ఎక్కువ ప్లస్ అయింది. కొన్ని సీన్లలో బిజిఎం పెద్దగా వినిపించకపోయిన అవసరమైన సీన్లలో బిజిఎం కీలక పాత్ర పోషించింది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. లొకేషన్స్ అన్ని అవుట్డోర్ కావడంతో ప్రతి ప్రేమ్ ఎంతో అందంగా అలంకరించినట్లు న్యాచురల్ గా అనిపించింది. అలాగే ప్రతి సాంకేతికత విషయంలోనూ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తొలి దర్శకత్వం అయినప్పటికీ దర్శకుడు యొక్క నేపథ్యత అలాగే నిర్మాణ విలువలు బెస్ట్ అనిపించేలా కనిపిస్తున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
కథ, దర్శకత్వం, నటీనటుల నటన, నిర్మాణ విలువలు.
మైనస్ పాయింట్స్ :
రెండవ భాగం స్లోగా ఉండటం, అక్కడక్కడ బిజిఎం.
సారాంశం :
ఒక ఊరి సమస్యను ఉన్న పరిస్థితులలో లౌక్యంతో పరిష్కరించడం ద్వారా ఎన్నో మానవ విలువలు తెలుపుతూ ప్రేక్షకులు అంతా కుటుంబ సమేతంగా చూడవలసిన చిత్రం దండోరా.


