రికార్డులు క్రియేట్ చేసిన ఆది సాయికుమార్ ‘శంబాల’

ఆది సాయి కుమార్ కెరీర్‌లోనే ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ‘శంబాల’ నిలిచింది. పాజిటివ్ మౌత్ టాక్‌తో షోలు, స్క్రీన్‌లు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రిస్మస్ సీజన్‌ను ‘శంబాల’ అద్భుతంగా వాడుకుంటోంది. ప్రీమియర్ల నుంచి మొదలైన పాజిటివ్ టాక్ డే వన్‌కి రెండు తెలుగు రాష్ట్రాల్లోకి వ్యాపించింది. ప్రస్తుతం ఈ మూవీ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ఈ చిత్రం ఆరంభం, కలెక్షన్లలో వస్తున్న పెరుగుదల చూసి ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోతోన్నాయి. లిమిటెడ్ స్క్రీన్లలో రిలీజ్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఫుల్ డిమాండ్‌తో దూసుకుపోతోంది.

యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ చిత్రం మంచి అంచనాలతోనే ఆడియెన్స్ ముందుకు వచ్చింది. కంటెంట్ మీదున్న నమ్మకంతో రిలీజ్‌కు రెండ్రోజుల ముందు నుంచీ ప్రీమియర్లు వేస్తూ వచ్చారు. అలా వేసిన ప్రీమియర్ల నుంచి పాజిటివ్ టాక్ రావడం, డే వన్‌కి అది మరింతగా పెరగడంతో అన్ని చోట్లా షోలు హౌస్ ఫుల్స్ అయ్యాయి. పైగా సినిమాకు డిమాండ్ పెరగడంతో అన్ని ఏరియాల్లోనూ షోలు, స్క్రీన్‌లను పెంచేశారు. నగరాల్లోని మల్టీప్లెక్స్‌లు మాత్రమే కాకుండా చిన్న చిన్న సెంటర్లలోని సింగిల్ స్క్రీన్లలో సైతం హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. మంచి ఆక్యుపెన్సీతో దూసుకుపోతోన్న ఈ మూవీ డే వన్ ప్రపంచవ్యాప్తంగా 3.5 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది.

ఇక రెండో రోజు నుంచి అన్ని చోట్లా స్క్రీన్లను పెంచేసిన సంగతి తెలిసిందే. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని, రానున్న రోజుల్లో ‘శంబాల’ మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద ఈ మూవీని మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి ప్రవీణ్ కె బంగారి విజువల్స్, శ్రీ చరణ్ పాకాల ఆర్ఆర్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఆది సాయి కుమార్ పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని, సినిమా బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోందని ఆడియెన్స్ ఇస్తున్న రివ్యూలు అందరికీ తెలిసిందే. పాజిటివ్ మౌత్ టాక్‌తో ఈ క్రిస్మస్ సీజన్‌లోని లాంగ్ రన్‌ వాడుకుంటూ ‘శంబాల’ అనేక రికార్డుల్ని బద్దలు కొట్టేలా కనిపిస్తోంది.

Related Articles

Latest Articles