
తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన 2025–27 ఫిలిం ఛాంబర్ ఎన్నికలు నేడు ఫిలిం ఛాంబర్ నందు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికలలో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుండి 31 మంది విజయం సాధించగా మన ప్యానల్ నుండి 17 మంది విజయం సాధించారు. దీనితో నూతన అధ్యక్షునిగా దగ్గుబాటి సురేష్ బాబు ఎన్నికయ్యారు. అలాగే ఉప అధ్యక్షుడిగా నాగ వంశీ, భరత్ చౌదరి ఎన్నిక కాగా కార్యదర్శిగా అశోక్ కుమార్ ఎన్నికయ్యారు. జాయింట్ సెక్రటరీగా మోహన్ వడ్లపట్ల, విజయేందర్ రెడ్డి ఎన్నిక కాగా ముత్యాల రామదాసు ట్రెజరర్ ఎన్నుకోబడ్డారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు దగ్గుబాటి సురేష్ బాబు గారు మాట్లాడుతూ… “ఈ ఎన్నికలలో మేము యునానిమస్ గా గెలిచినప్పటికీ ఏ నిర్ణయం అయినా అందరం కలిసే తీసుకుంటాము. లోకల్, నాన్ లోకల్ సమస్యలను సాల్వ్ చేస్తాము. రాష్ట్రాల ప్రభుత్వాలను కలిసి చిత్ర పరిశ్రమను మరింత బెటర్ గా మారుస్తాము. ఉద్యోగ అవకాశాలు పెంచి అంతా కలిసికట్టుగా పనిచేసుకుంటాము” అన్నారు.


