
సమాజంలో ఒంటరిగా ఉన్న మహిళలు మరియు అమ్మాయిలపై గ్యాంగ్ రేపులు , మర్డర్స్ జరిగిన ఒక రియల్ ఇంసెడెంట్ ని బేస్ చేసుకుని అసలు నేరస్థులు ఎవరు? వాళ్ల్లు తప్పించుకుంటే నేరస్తుల్ని చనిపోయిన అమ్మాయి అక్క అమ్మాయి స్నేహితురాళ్ళతో కలిసి ఎలా కనిపెట్టి పట్టుకుంది .ఆ కుటుంబం సమాజాన్ని ఎలా ఎదుర్కొంది ? తన చెల్లి కి జరిగిన అన్యాయానికి వాళ్లపై పగతీర్చుకుందా లేక చట్టానికి అప్పగించిందా అనే సస్పెన్స్ కథాంశంతో, ఈ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది .
నిర్మాతలు యు నరసింహులు, ఎస్ రమేష్ లు మాట్లాడుతూ మా 4 గర్ల్స్ సినిమాకు అమెజాన్ ప్రైమ్ , BCINEET , ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ , హంగామా ప్లే , టాటా ప్లే బెంజ్ , వాచో, Vewd, క్లౌడ్ వాకర్ , Zeasn , అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ ఇంకా ప్రముఖ ఓటిటి లలో మరియు అన్ని స్మార్ట్ టీవీ డివైసెస్, బ్రాడ్బ్యాండ్ డివైసెస్, స్మార్ట్ స్టిక్ డివైసెస్ లలో తెలుగు , తమిళం , హిందీ , కన్నడ , మలయాళం భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది, ఓటిటి లలో మంచి రెస్పాన్స్ వస్తుంది. మా మొదటి సినిమానే ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ , క్రైమ్ , రివెంజ్ , థ్రిల్లర్ సినిమా చేసినందుకు ఆనందంగా ఉంది . ఈ సందర్భం గా మా సినిమాని డైరెక్ట్ గా అన్ని ఓటిటి సంస్థలలో రిలీజ్ చేసిన Bcineet (B Cine ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ) సంస్థ బోయపాటి దిలీప్ కుమార్ ( Dk బోయపాటి ) గారికి మా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం . అందరూ మా సినిమాని చూసి మరింత ఆదరిస్తారని కోరుతున్నామన్నారు .
నటి నటులు :
శృతిక గాఒక్కర్ , ఆకాంక్ష వర్మ , దితిప్రియ రాయ్ , సెజల్ మాండవియ , అంకుర్ , ప్రిన్స్ , హన్సి శ్రినివాస్తవ .
టెక్నీకల్ టీమ్ :
డి ఓ పి : జగదీశ్ , మ్యూజిక్ : జయసూర్య , బాక్గ్రౌండ్ స్కోర్ : ఎం .న్ .ర్ , స్టంట్స్ : డ్రాగన్ ప్రకాష్ , ప్రొడ్యూసర్స్ : యూ నరసింహులు , ఎస్ రమేష్ , డైరెక్టర్ : ఎస్ . శివ , వరల్డ్ వైడ్ రిలీజ్ : బి సినీ ఈ టి (బి సినీ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ).


