
మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి విన్నర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (MSG) రికార్డుల మోత మోగిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి వారంలో రాక్ సాలిడ్ హోల్డ్ చూపించి, బ్రేక్ ఈవెన్ సాధించింది. నిన్న 31 కోట్లు వసూలు చేసి, ప్రపంచవ్యాప్తంగా 292 కోట్లకు చేరుకుంది. ఈరోజు 300 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టనుంది. అనిల్ రావిపూడి కెరీర్‌లో అత్యధిక వసూళ్ల చిత్రంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ను దాటేస్తుంది. AP & TSలో 7వ రోజు ఆల్‌టైమ్ హయ్యస్ట్ షేర్ సాధించింది.
రెండో వారంలో కూడా అన్ని చోట్ల ఎక్సలెంట్ ఆక్యుపెన్సీలు నమోదవుతున్నాయి. ఓవర్‌సీస్‌లోనూ సంచలనం – నార్త్ అమెరికాలో $2.96 మిలియన్లు వసూలు చేసి, $3 మిలియన్ల మార్క్‌కు చేరువవుతోంది. చిరంజీవి, అనిల్ ద్వయానికి ఇది మొదటి సారి. ఈ పేస్‌తో చిరంజీవి ఆల్‌టైమ్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలవనుంది.
చిరంజీవి స్టార్ పవర్, అనిల్ రావిపూడి వరుస బ్లాక్‌బస్టర్ల క్రెడిబిలిటీ, పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్, ఫ్యామిలీ ఆడియన్స్ టర్నౌట్‌లతో సంక్రాంతి పోటీలో క్లియర్ విన్నర్‌గా నిలిచింది. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా బాక్సాఫీస్‌ను డామినేట్ చేస్తోంది.


