
ముంబైలోని ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్పై కాల్పులు జరిగిన ఘటనలో బాలీవుడ్ నటుడు కమాల్ ఆర్ ఖాన్(KRK)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫైరింగ్ చేసిన తుపాకీని సీజ్ చేశారు. తన లైసెన్స్డ్ గన్ని క్లీన్ చేశాక టెస్ట్ చేసేందుకు 4 రౌండ్స్ ఫైర్ చేసినట్లు ఆయన అంగీకరించారు. జనవరి 18న ఘటన జరగ్గా పోలీసులు దర్యాప్తు చేసి ఫైరింగ్ జరిపింది KRKగా గుర్తించారు. తన వివాదాస్పద రివ్యూలతో ఈయన తరచూ వార్తల్లో ఉంటుంటారు.


