బుక్ మై షోలో అల్-టైమ్ రికార్డు సాధించిన చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (ఎమ్‌ఎస్‌జి) మూడో వారంలో కూడా బాక్సాఫీస్‌లో అజేయంగా దూసుకుపోతోంది. బుక్ మై షో (బిఎమ్‌ఎస్) ప్లాట్‌ఫామ్‌లో ఈ చిత్రం సంచలనాత్మక రికార్డు నమోదు చేసింది.

ఎమ్‌ఎస్‌జి రీజినల్ సినిమాల్లో అల్-టైమ్ నెం.1గా నిలిచి, 3.6 మిలియన్ టికెట్లు విక్రయించి మునుపటి రికార్డు ‘సంక్రాంతికి వస్తున్నాం’ (3.59 మిలియన్)ను అధిగమించింది. 14వ రోజు 122.2కే టికెట్లు విక్రయమైన ఈ చిత్రం, ప్లాట్‌ఫామ్‌లో ఇప్పటికీ టాప్‌లో ఉండి, గంటకు 9కే పైగా టికెట్లు అమ్ముతోంది.

ప్రపంచవ్యాప్తంగా కూడా ఎమ్‌ఎస్‌జి బలమైన ప్రదర్శన కనబరుస్తోంది. నార్త్ అమెరికాలో $3.5 మిలియన్ మైలురాయి వైపు దూసుకుపోతున్న ఈ సినిమా, చిరంజీవి మరియు డైరెక్టర్ అనిల్ రవిపూడి కెరీర్‌లో హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలుస్తోంది. వరల్డ్‌వైడ్ కలెక్షన్లలో ఇద్దరికీ అతిపెద్ద విజయం. పూర్తి రన్‌లో 400 కోట్ల మార్కును తాకే అవకాశం ఉంది.

Related Articles

Latest Articles