
విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాతగా ఎంఎం నాయుడు రచన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సుమతీ శతకం. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో టేస్టీ తేజ, మహేష్ విట్ట, JDV ప్రసాద్, ఆకెళ్ళ గోపి కృష్ణ, కిరణ్ విజయ్, మిర్చి కిరణ్, నెల్లూరు నీరజ, మలక్పేట్ శైలజ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి నహిద్ మహమ్మద్ ఎడిటింగ్ చేయగా ఎస్ హలేష్ సినిమాటోగ్రాఫర్ గా చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ఫస్ట్ లుక్, టీజర్, పాటలకు ప్రేక్షకుల నుండి ఇప్పటికే మంచి స్పందన లభించింది.
ఫిబ్రవరి 6వ తేదీన మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ ద్వారా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా ఈ చిత్ర బృందం గత కొన్ని రోజులుగా ఇరు తెలుగు రాష్ట్రాలలో ప్రమోషన్స్ చేస్తూ కళాశాలలు, దేవాలయాలు అలాగే ఇతర పరిసర ప్రాంతాలలో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్ ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంలోని కొన్ని కళాశాలలో ప్రమోషనల్ టూర్స్ చేయడం జరిగింది. కర్నూలు లోని అశోక్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, అనంతపూర్ లోని శ్రీనివాస రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కడపలోని సి వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, రాజంపేట అన్నమాచార్య యూనివర్సిటీ కళాశాలలో ప్రమోషన్స్ చేయగా విద్యార్థుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. అంతేకాక చిత్ర బృందం అంత కలిసి దైవ ఆశీస్సుల కొరకు కడపలోని అమీర్ పీర్ దర్గాను దర్శించుకున్నారు. చిత్ర విడుదల తేది దగ్గరవుతున్న ఈ తరుణంలో సుమతీ శతకం బృందం మరింత చురుకుగా ప్రమోషన్స్ చేస్తూ కొనసాగుతున్నారు.
నటీనటులు : అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి, టేస్టీ తేజ, మహేష్ విట్ట, JDV ప్రసాద్, ఆకెళ్ళ గోపి కృష్ణ, కిరణ్ విజయ్, మిర్చి కిరణ్, నెల్లూరు నీరజ, మలక్పేట్ శైలజ తదితరులు.
సాంకేతిక నిపుణులు :
రచన, దర్శకత్వం : ఎంఎం నాయుడు
నిర్మాత : సాయి సుధాకర్ కొమ్మాలపాటి
బ్యానర్ : విజన్ మూవీ మేకర్స్
సమర్పణ : కొమ్మాలపాటి శ్రీధర్
సినిమాటోగ్రాఫర్ : ఎస్ హలేష్
ఎడిటర్ : నహిద్ మహమ్మద్
సంగీతం : సుభాష్ ఆనంద్
డైలాగ్స్ : బండారు నాయుడు
పిఆర్ఓ : మధు విఆర్
డిజిటల్ మార్కెటింగ్ : హౌస్ ఫుల్ మీడియా, డిజిటల్ దుకాణం


