జూన్ 4న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కానున్న రామ్ చరణ్ ‘పెద్ది’

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ షూటింగ్ మొత్తం పూర్తయింది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. చిత్ర బృందం ఇప్పుడు ఒక ముఖ్యమైన అప్‌డేట్‌తో అభిమానులను సర్ప్రైజ్ చేసింది. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

జూన్ ప్రారంభంలో రిలీజ్ కావడం వల్ల సమ్మర్ హాలిడేస్ చివరి దశలో థియేటర్స్ లో ప్రేక్షక ఆదరణ అందుకోవడానికి ఇది పర్ఫెక్ట్ టైం. అకడమిక్ సీజన్ మొదలయ్యే ముందు దేశ వ్యాప్తంగా మంచి ఫుట్‌ఫాల్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

హైదరాబాద్‌లోని ఒక భారీ సెట్‌లో ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఒక అద్భుతమైన స్పెషల్ సాంగ్ చిత్రీకరణను చిత్ర బృందం పూర్తి చేయడంతో అధికారికంగా ప్రొడక్షన్ వర్క్స్ పూర్తయ్యాయి. ఈ ఎనర్జిటిక్ సాంగ్ ‘పెద్ది’ చిత్రంలోని మెయిన్ హైలెట్స్ లో ఒకటిగా నిలవనుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సైమల్టేనియస్‌ గా వేగంగా సాగుతున్నాయి.

ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, అనుభవజ్ఞులైన నటులు శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

టాప్ టెక్నికల్ టీం ఈ సినిమాకి పనిచేస్తున్నారు. ఆర్. రత్నవేలు సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్‌, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్‌ అందిస్తున్నారు.

ఇంటెన్స్ యాక్షన్, స్ట్రాంగ్ ఎమోషన్స్ తో కూడిన రూరల్ స్పోర్ట్స్ కథాంశంగా రూపొందిన ‘పెద్ది’ హిందీతో పాటు అన్ని దక్షిణ భారత భాషలలో పాన్-ఇండియా స్థాయిలో ఘనంగా విడుదల కానుంది.

తారాగణం: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: బుచ్చిబాబు సాన
సమర్పణ: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
బ్యానర్: వృద్ధి సినిమాస్
నిర్మాత: వెంకట సతీష్ కిలారు
సహ నిర్మాత: ఇషాన్ సక్సేనా
సంగీతం: ఏఆర్ రెహమాన్
DOP: ఆర్ రత్నవేలు
ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా
ఎడిటర్: నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి.వై.ప్రవీణ్ కుమార్
మార్కెటింగ్: ఫస్ట్ షో
PRO: వంశీ-శేఖర్

Related Articles

Latest Articles